Jagan: కుదిరిన ముహూర్తం... సరిగ్గా 12 గంటల 23 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయనున్న జగన్!

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు శరవేగంతో సాగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లతో తిరుగులేని మెజారిటీ సంపాదించిన జగన్ ఈ నెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. జగన్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం కుదిరింది. గురువారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 23 నిమిషాలకు ఆయన ప్రమాణం చేస్తారని సమాచారం. కాగా, జగన్ ప్రమాణస్వీకార మహోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు రానున్నారు. అనేక రంగాలకు చెందిన ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Jagan
Vijayawada
Andhra Pradesh

More Telugu News