Jagan: ప్రగతి భవన్ చేరుకున్న వైఎస్ జగన్... సాదరంగా స్వాగతం పలికిన కేటీఆర్

  • ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన జగన్
  • జగన్ కు విషెస్ తెలిపిన తెలంగాణ మంత్రులు
  • కాసేపట్లో సీఎం కేసీఆర్ తో భేటీ
తొలిసారి ఏపీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించబోతున్న వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ చేరుకున్నారు. ప్రగతి భవన్ లో ఆయనకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదరంగా స్వాగతం పలికారు. ఆయన వెంట తెలంగాణ మంత్రులు కూడా ఉన్నారు. మరికాసేపట్లో జగన్ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. కేసీఆర్ ను కలిసి ఈనెల 30న జరిగే ప్రమాణస్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించనున్నారు.

ఏపీ ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ వచ్చిన జగన్ కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్ భవన్ వరకు, రాజ్ భవన్ నుంచి ప్రగతి భవన్ వరకు జగన్ ప్రయాణమార్గంలో అభిమానులు భారీసంఖ్యలో కనిపించారు. వారంతా "సీఎం సీఎం" అంటూ నినాదాలతో హోరెత్తించారు.
Jagan
KTR
KCR

More Telugu News