Jagan: ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి... గవర్నర్ ను కోరిన జగన్

షార్ట్స్‌లో చూడండి
ఏపీ కాబోయే సీఎం, వైసీపీ అధినేత జగన్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్న జగన్ భారీ కాన్వాయ్ తో రాజ్ భవన్ కు తరలివెళ్లారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసిన జగన్ ఆయనతో సమావేశమై పలు విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా వైసీపీ శాసనసభా పక్షం తీర్మాన ప్రతిని గవర్నర్ కు అందజేశారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమను ఆహ్వానించాలంటూ జగన్ గవర్నర్ ను కోరారు. కాగా, జగన్ వెంట రాజ్ భవన్ కు వచ్చినవారిలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేశ్ తదితరులున్నారు. ఈ సందర్భంగా నరసింహన్  రాజ్ భవన్ అధికారులను జగన్ కు పరిచయం చేశారు. ఈ భేటీలో భాగంగా జగన్ గవర్నర్ తో కాసేపు ఏకాంతంగా మాట్లాడినట్టు తెలిసింది. కాగా, జగన్ వస్తున్నాడని తెలియడంతో హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల విషెస్ చెబుతూ భారీ హోర్డింగ్ లు వెలిశాయి.
Go Back to Shorts
Jagan
YSRCP
Hyderabad

More Telugu News