Rahul Gandhi: రాహుల్ గాంధీ రాజీనామాను తిరస్కరించిన సీడబ్ల్యూసీ

షార్ట్స్‌లో చూడండి
సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం చవిచూసిన కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలనలో మునిగితేలుతోంది. ఇప్పటికే పలువురు పీసీసీ చీఫ్ లు రాజీనామాలు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు సీనియర్లు హాజరైన ఈ సమావేశంలో ఓటమికి కారణాలపై చర్చించారు.

ముఖ్యంగా, రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరవైఫల్యానికి కారణం తనదేనని చెప్పారు. అందుకే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. అయితే, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ రాహుల్ రాజీనామాను తిరస్కరించింది. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా సంపాదించలేకపోవడం పట్ల తనదే నైతిక బాధ్యత అని రాహుల్ మరోసారి చెప్పగా, సీడబ్ల్యూసీ సభ్యులు రాహుల్ ను అనునయించారు.
Go Back to Shorts
Rahul Gandhi
Congress

More Telugu News