Jagan: ప్రత్యేక విమానంలో జగన్ హైదరాబాద్ పయనం

షార్ట్స్‌లో చూడండి
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించిన జగన్, అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ పయనం అయ్యారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లిన జగన్ హైదరాబాద్ బయల్దేరారు. కాగా, జగన్ గవర్నర్ ను కలిసేందుకు బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్ భవన్ కు వెళతారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ను కలిసి ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించనున్నారు.

మరికొన్నిరోజుల పాటు జగన్ బిజీగా గడపనున్నారు. ఆదివారం ఉదయం ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. రాష్ట్రానికి తిరిగివచ్చిన అనంతరం పులివెందుల వెళ్లి తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. ఈ నెల 30న జగన్ ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Jagan
Hyderabad

More Telugu News