Andhra Pradesh: పవన్ కల్యాణ్ కు, నాగబాబుకు వ్యతిరేకంగా నేను ప్రచారం చేయలేదు: సినీ నటుడు రాజశేఖర్

  • వైసీపీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ప్రచారం చేశాను
  • ఏపీలో వైసీపీ విజయంపై రాజశేఖర్ హర్షం  
  • పది, పదిహేనేళ్ల పాటు జగన్ సీఎంగా ఉంటారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు, ఆ పార్టీ నేత నాగబాబుకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం తాను చేయలేదని వైసీపీ స్టార్ క్యాంపెయినర్, సినీ నటుడు రాజశేఖర్ అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భీమవరంలో పవన్ కు, నరసాపురంలో నాగబాబుకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించినట్టు వస్తున్న వార్తలు కరెక్టు కాదని అన్నారు. వైసీపీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ప్రచారం చేసినట్టు చెప్పారు.

ఈ సందర్భంగా పార్టీలు మారే అంశంపై రాజశేఖర్ మాట్లాడుతూ, పార్టీలు మారితే తప్పేంటి? ఓటర్లు ఎప్పుడూ ఒక పార్టీకే ఓటేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఒక ఎన్నికల్లో ఒక పార్టీకి ఓటేస్..తే ఇంకో ఎన్నికల్లో ఇంకో పార్టీకి వేస్తారని, అలాగే, సందర్భాన్ని అనుసరించి తాను పార్టీలు మారానని అన్నారు. ఏపీలో వైసీపీ విజయంపై రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. పది, పదిహేనేళ్ల పాటు జగన్ సీఎంగా ఉంటారని, ఆయనలో ఆ కసి కనిపిస్తోందని రాజశేఖర్ వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
YSRCP
jagan
artist
pawan

More Telugu News