BJP: బీజేపీని అవే గెలిపించాయి: అసదుద్దీన్ ఒవైసీ

  • హిందూత్వ, జాతీయవాద నినాదాలు బాగా పనిచేశాయి
  • ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది
  • అణగారిన వర్గాల సమస్యలపై పార్లమెంటులో గొంతెత్తుతా
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం వెనక ఉన్న కారణాలను హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విశ్లేషించారు. వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ వినిపించిన హిందుత్వ, జాతీయవాదాలు బాగా పనిచేశాయని, ఆ పార్టీని అవే విజయ తీరాలకు చేర్చాయని అసద్ అభిప్రాయపడ్డారు. బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు మజ్లిస్ పోరాడుతూనే ఉంటుందని పేర్కొన్నారు. తామెప్పుడూ ప్రజలతోనే ఉంటామని, పేదలు, అణగారిన వర్గాలు, మైనారిటీల సమస్యలపై పార్లమెంటులో గొంతెత్తుతూనే ఉంటానని అసద్ స్పష్టం చేశారు. తాజా ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పోటీ చేసిన అసద్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత భగవంత్‌రావుపై ఘన విజయం సాధించారు.  
BJP
MIM
Asaduddin Owaisi
Hyderabad

More Telugu News