RGV: లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి మరోసారి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన వర్మ

  • ఈనెల 31న విడుదల చేస్తున్నట్టు ట్వీట్
  • ఈ నెల 30న జగన్ ప్రమాణస్వీకారం
  • ఆ మరుసటి రోజే వర్మ చిత్రం రిలీజ్
ఎన్టీఆర్ జీవిత చరమాంకంలోని కొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఏపీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో కొన్ని ఫిర్యాదులు రావడంతో ఈ సినిమా విడుదలకు ఈసీ అడ్డుచెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో జగన్ ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు.
 
ఇక ఆ మరుసటి రోజే రామ్ గోపాల్ వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. "ఎట్టకేలకు మే 31న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రిలీజ్ చేయడం ద్వారా అసలు నిజాన్ని వెల్లడిస్తున్నాను, తద్వారా ప్రతీకారం తీర్చుకుంటున్నాను" అంటూ వర్మ ట్వీట్ చేశారు.

RGV
Jagan
Andhra Pradesh

More Telugu News