Jagan: వైఎస్సార్ ఒక్కడుగు వేస్తే జగన్ రెండడుగులు వేస్తారు: కోమటిరెడ్డి

  • భువనగిరి ఎంపీగా గెలిచిన కోమటిరెడ్డి
  • జగన్ పై ప్రశంసలు
  • వైఎస్ తో పోలిక
భువనగిరి లోక్ సభ అభ్యర్థిగా విజయం సాధించిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీ అసెంబ్లీ ఫలితాలపై స్పందించారు. తెలంగాణలో తాను ఎంపీగా గెలవడం, అటు ఏపీలో జగన్ సీఎం కానుండడం ఎంతో సంతోషం కలిగిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా జగన్ తండ్రి వైఎస్సార్ ను కూడా ప్రస్తావించారు. ప్రజల విషయంలో వైఎస్సార్ ఎప్పుడూ ముందుండేవారని, జగన్ ఆయన్ను మించిపోతారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ ఒక్కడుగు వేస్తే జగన్ రెండడుగులు వేస్తారని కితాబిచ్చారు. జగన్ ఈస్థాయికి చేరడం వెనుక పదేళ్ల శ్రమ ఉందని, ఎంతో కష్టించి ప్రజాదరణ పొందారని ప్రశంసించారు.
Jagan
Komatireddy

More Telugu News