YSRCP: లోకేశ్ నాతో పోటీకి సరిపోడు: ఆళ్ల రామకృష్ణారెడ్డి

  • లోకేశ్ కు అవగాహనలేదు
  • చంద్రబాబే బరిలో దించారు
  • జగన్ పాలనపై రైతులు ఆందోళన చెందనక్కర్లేదు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ మంత్రి నారా లోకేశ్ ను ఓడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోకేశ్ ఏ విధంగానూ తనతో పోటీకి సరిపోడని అభిప్రాయపడ్డారు. లోకేశ్ కు ప్రత్యక్ష రాజకీయాలపై ఏమాత్రం అవగాహనలేదని, ఆ విషయం తెలిసి కూడా చంద్రబాబు కొడుకును బరిలో దింపారని ఆళ్ల విమర్శించారు. ఆ విధంగా లోకేశ్ ఓటమికి చంద్రబాబే పరోక్షంగా కారకులయ్యారని ఆరోపించారు. జగన్ పాలనపై ఎవరూ ఎలాంటి అపోహలకు గురికావాల్సిన పనిలేదని, ముఖ్యంగా రైతులు ఏ విషయంలోనూ ఆందోళన చెందనక్కర్లేదని వివరించారు.
YSRCP
Chandrababu
Nara Lokesh
Telugudesam

More Telugu News