Jagan: కాబోయే సీఎం జగన్ ను కలిసిన 23 ప్రభుత్వ శాఖల అధికారులు

  • వివరాలు అందజేసిన అధికారులు
  • తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద కోలాహలం
  • పోటెత్తుతున్న అభిమానులు
వైసీపీ అధినేత, ఏపీ కాబోయే సీఎం జగన్ నివాసం వద్ద భారీ కోలాహలం కనిపిస్తోంది. తాడేపల్లిలోని జగన్ నివాసానికి ఈ ఉదయం 23 ప్రభుత్వ శాఖలకు చెందిన 57 మంది అధికారులు తరలివెళ్లారు. వీరిలో ఐఏఎస్, ఐపీఎస్ లు ఉన్నారు. జగన్ ను మర్యాదపూర్వకంగా పలకరించిన అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన వివరాలను జగన్ కు అందజేశారు. జగన్ అందరు అధికారులతో సావధానంగా మాట్లాడారు.

కాగా, ఎన్నికల్లో ఘనవిజయం సాధించినప్పటినుంచి జగన్ క్షణం తీరికలేకుండా ఉన్నారు. ఆయనను కలిసి విషెస్ చెప్పేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో తాడేపల్లి నివాసానికి వస్తున్నారు. అందరినీ కలుస్తూ, అభినందనలు స్వీకరిస్తూ జగన్ ఉత్సాహంగా గడుపుతున్నారు. ఆయన ఈనెల 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే.
Jagan
Andhra Pradesh

More Telugu News