Andhra Pradesh: టీడీపీ అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారు!: శిల్పా చక్రపాణి రెడ్డి

  • ఏపీ ప్రజలు రాజన్న రాజ్యం కోరుకున్నారు 
  • చంద్రబాబు జైలుకు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
  • కర్నూలులో మీడియాతో వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజన్న రాజ్యం రావాలని కోరుకున్నారని వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. చంద్రబాబు పాలనను ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. తనను గెలిపించిన కర్నూలు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కుమారుడు లోకేశ్ ను గెలుపించుకోవడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. కర్నూలు జిల్లా కేంద్రంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఏపీ సీఎం చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని చక్రపాణిరెడ్డి జోస్యం చెప్పారు. టీడీపీ అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. అందుకే జగన్ కష్టాన్ని గుర్తించిన ప్రజలు భారీ మెజారిటీని కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను, పరిశ్రమలు, ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసేందుకు కృషి  చేస్తానని హామీ ఇచ్చారు. ఏపీలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులకు మంచి రోజులు వచ్చాయని శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు.
Andhra Pradesh
Telugudesam
YSRCP
Jagan
Chandrababu

More Telugu News