Andhra Pradesh: ఏపీలో జగన్ ఘనవిజయంపై స్పందించిన హీరో మహేశ్ బాబు!

  • జగన్ గారికి శుభాకాంక్షలు
  • మీ పాలనలో ఏపీ సరికొత్త ఎత్తుకు  చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నా
  • మోదీకి అభినందనలు తెలిపిన సూపర్ స్టార్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. ‘ఏపీలో ఘనవిజయం సాధించిన వైఎస్ జగన్ గారికి శుభాకాంక్షలు. మీ పాలనలో రాష్ట్రం సరికొత్త ఎత్తుకు చేరుకోవాలనీ, మీ పదవీకాలం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. అలాగే కేంద్రంలో ఘనవిజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి మహేశ్ అభినందనలు తెలిపారు. మోదీ పాలనలో భారత్ సుస్థిరతవైపు దూసుకుపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Jagan
YSRCP
Narendra Modi
Mahesh Babu

More Telugu News