Kodali Nani: చంద్రబాబు వెనకున్న టాప్ 10 బ్రోకర్ల పేర్లను త్వరలో చెబుతా: కొడాలి నాని

  • ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు
  • జగన్ సీఎం అయితే గూండారాజ్యమని తప్పుడు ప్రచారం
  • చంద్రబాబును ప్రజలే సాగనంపారన్న కొడాలి నాని
వైఎస్ జగన్ పేరు ప్రతిష్ఠలను చెడగొట్టేందుకు చంద్రబాబు ఎంతో ప్రయత్నించి విఫలం అయ్యారని గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్నో పోరాటాలు చేసి, ప్రజలకు దగ్గరైనందునే వైసీపీకి ఇంత పెద్ద విజయం లభించిందని వ్యాఖ్యానించిన ఆయన, వైసీపీ వస్తే అనర్థాలు జరుగుతాయని చంద్రబాబు చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని అన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని నిప్పులు చెరిగారు.

 నాలుగేళ్ల పాటు మోదీ వెంట తిరిగి, చివర్లో తనపై ఉన్న వ్యతిరేకతను మోదీపై తోయాలని చూసి విఫలమయ్యారని అన్నారు. చంద్రబాబుతో పాటు 10 మంది బ్రోకర్లు ఉన్నారని, వారికి ఢిల్లీలో మోదీ, హైదరాబాద్ లో కేసీఆర్, ఏపీలో జగన్ ఉండకూడదన్నదే వారి ఉద్దేశమని, వారి పేర్లను తాను తరువాత చెబుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎం అయితే గూండారాజ్యం వస్తుందని, అమరావతిని మార్చేస్తారని తప్పుడు ప్రచారం సాగించింది వారేనని విమర్శించారు. నేడు బడుగు, బలహీన వర్గాలు, పేదలు చంద్రబాబును సాగనంపాలని భావించి ఈ తీర్పును ఇచ్చారని, ప్రజల నమ్మకాన్ని వైసీపీ నిలుపుకుంటుందని చెప్పారు.
Kodali Nani
Jagan
Chandrababu

More Telugu News