Kushboo: అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన ఖుష్బూ!

షార్ట్స్‌లో చూడండి
సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నేత ఖుష్బూ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. విపరీతమైన తలపోటు కారణంగా నిన్న ఆమె చెన్నైలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. తాను అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయాన్ని ఆమే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన పదవిలో ఉన్న తాను, లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ, టెలివిజన్ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వుందని, ఈ సమయంలో అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చేరాల్సి రావడంతో బాధ కలుగుతోందని చెప్పారు. ఆపై ఈ ఉదయం, తాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళుతున్నానని, తన ఆరోగ్యం గురించి వాకబు చేసిన వారికి, ప్రేమాభిమానాలు చూపిన అభిమానులకు కృతజ్ఞతలని అన్నారు.







Go Back to Shorts
Kushboo
Hospital
Health
Twitter

More Telugu News