Andhra Pradesh: జగన్ మరో 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాడు.. బ్రహ్మాండంగా పనిచేస్తాడు!: మోహన్ బాబు
- ఏపీలో విజయం క్రెడిట్ అంతా జగన్ కే
- పాదయాత్రలో ఆయనకు భారీ స్పందన వచ్చింది
- తిరుపతిలో మీడియాతో వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయానికి సంబంధించి క్రెడిట్ మొత్తం జగన్ కే పోతుందని వైసీపీ నేత, నటుడు మోహన్ బాబు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం జగన్ మామూలుగా కష్టపడలేదని వ్యాఖ్యానించారు. అలాంటి జగన్ ఏపీకి ముఖ్యమంత్రి కావడం తనకు ఆనందాన్ని కలిగించిందని అన్నారు. జగన్ ప్రజాసంకల్పయాత్రలో అనూహ్య స్పందన వచ్చేదనీ, అప్పుడే జగన్ సీఎంగా గెలుస్తాడని తనకు అర్థం అయిందని చెప్పారు. తిరుపతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జగన్ కు భగవంతుడు నూరేళ్లు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. జగన్ బ్రహ్మాండంగా పనిచేస్తాడన్న నమ్మకం తనకు ఉందన్నారు. పశ్చిమబెంగాల్ మాజీ సీఎం, కమ్యూనిస్టు యోధుడు జ్యోతిబసు తరహాలో జగన్ 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాడని జోస్యం చెప్పారు.