ISW: బులెట్ ప్రూఫ్ వాహనం, జామర్ సహా... జగన్ కోసం వచ్చేసిన కాన్వాయ్!

  • వచ్చే వారంలో జగన్ ప్రమాణ స్వీకారం
  • ఆరు వాహనాలతో కాన్వాయ్
  • జగన్ భద్రత ఇక ఐఎస్ డబ్ల్యూ పరిధిలో
వచ్చే వారం నవ్యాంధ్రకు రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ కోసం, ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక కాన్వాయ్ ని సిద్ధం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని జగన్ నివాసం వద్ద భద్రతను పెంచిన పోలీసులు, ఆ ప్రాంతాన్నంతా మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. స్థానిక ఇళ్లలోనూ సోదాలు జరిపారు. ఇక జగన్ కాన్వాయ్ నిమిత్తం ఓ బులెట్ ప్రూఫ్ వాహనం, మొబైల్ సిగ్నల్ జామర్, అంబులెన్స్, సెక్యూరిటీ సిబ్బంది వాహనాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఆరు వాహనాల కాన్వాయ్ ని 'ఏపీ 18పీ 3418' నంబర్ తో అధికారులు కేటాయించారు. ఈ వాహనాలన్నీ ప్రస్తుతం జగన్ ఇంటి ముందే నిలిచివున్నాయి. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్ డబ్ల్యూ) రంగంలోకి దిగి, జగన్ భద్రతను స్వయంగా చేతుల్లోకి తీసుకుంది.
ISW
Convoy
Jagan
Undavalli

More Telugu News