ప్రతిపక్ష హోదాను దక్కించుకున్న టీడీపీ!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా అయింది. జగన్ ప్రభంజనంలో కొట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ విపక్ష హోదా అయినా దక్కడంతో ఊపిరి పీల్చుకుంది. ఈ ఎన్నికల్లో కేవలం 23 సీట్లకే పరిమితమైనప్పటికీ ప్రతిపక్ష పార్టీ హోదా దక్కడం కొంతలో కొంత మెరుగని ఆ పార్టీ నేతలు చెప్పుకొంటున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 26 స్థానాలకే పరిమితమైంది. మొత్తం స్థానాల్లో పదో వంతు సీట్లలో కూడా విజయం సాధించకపోవడంతో ఆ పార్టీకి విపక్ష హోదా కూడా దక్కలేదు. అప్పట్లో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 30 సీట్లు రావాలి. కానీ 4 సీట్ల ముందే ఆగిపోవడంతో విపక్ష హోదాకు నోచుకోలేకపోయింది. తాజా ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలను అతి కష్టం మీద దక్కించుకుంది. దీంతో కనీసం విపక్ష హోదా అయినా దక్కిందని నేతలు సంతోష పడుతున్నారు.
Go Back to Shorts
Telugudesam
YSRCP
Jagan
Chandrababu
Andhra Pradesh

More Telugu News