Sharad Pawar: రాజీవ్ హయాంలో కాంగ్రెస్ ఇంతకంటే భారీ విజయాలు సాధించింది... కానీ ప్రజలెప్పుడూ అనుమానపడలేదు: శరద్ పవార్

  • 1984లో కాంగ్రెస్ కు 400 సీట్ల దాకా వచ్చాయి
  • ఇప్పుడు ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి
  • ఫలితాలను అందరూ గౌరవించాల్సిందే
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం పట్ల ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ హవా ఉంటుందని విపక్షాలు భావించాయి కానీ దేశవ్యాప్తంగా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదని అన్నారు. రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్ ఇంతకంటే భారీ విజయాలు నమోదు చేసినా ప్రజలెప్పుడూ అనుమానపడలేదని స్పష్టం చేశారు.1984 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ నాయకత్వంలో దాదాపు 400 సీట్ల దాకా గెలుచుకుందని వివరించారు.

ఈసారి ఈవీఎంల పనితీరుపై ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఒక్కసారి ఫలితాలు వెలువడిన తర్వాత వాటిని అందరూ గౌరవించాల్సిందేనని ఈ సీనియర్ రాజకీయవేత్త స్పష్టం చేశారు.
Sharad Pawar

More Telugu News