Guntur District: ‘మొదటి సంతకం’ గురించిన ప్రశ్నకు జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • ‘నవరత్నాలు’ను నేను గట్టిగా నమ్ముతున్నా
  • ఒక్క సంతకం కాదు.. ‘నవరత్నాలు’ ఇవ్వబోతున్నాం
  • ‘నేను చూశా.. నేను విన్నా.. నేను ఉన్నా’
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం దేనిపై చేస్తారన్న ప్రశ్నకు కాబోయే ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘నవరత్నాలు’ను నేను గట్టిగా నమ్ముతున్నా. నా పాదయాత్రలో ప్రజలు పడిన కష్టాన్ని చూశా, ప్రజలు చెప్పిన బాధలను విన్నాను. ప్రతిఒక్కరికి నేను హామీ ఇస్తున్నా. ‘నేను చూశా.. నేను విన్నా.. నేను ఉన్నా’ అని ఈరోజున ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తున్నా. ఒక్క సంతకం కాదు.. ‘నవరత్నాలు’ను తీసుకొచ్చే పాలన ఇవ్వబోతున్నానని కచ్చితంగా చెబుతున్నా’ అని అన్నారు. కాగా, వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు ‘నవరత్నాలు’ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ‘నవరత్నాలు’ను వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరిచింది.
Guntur District
tadepalli
YSRCP
ys jagan

More Telugu News