YSRCP: ప్రభంజనం లాంటి విజయమిది: వైసీపీ నేత సజ్జల

  • చరిత్రలో జగన్ పాదయాత్ర నిలిచిపోయింది
  • చంద్రబాబు వద్దని ప్రజలు అనుకున్నారు
  • అందుకే, జగన్ కు పట్టం కట్టారు
ఏపీలో వైసీపీ ప్రభంజనం లాంటి విజయం సాధించబోతోందని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీలో ఇప్పటికే వెలువడ్డ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 67 స్థానాల్లో గెలుపొందగా, అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ సందర్భంగా మీడియాతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో జగన్ పాదయాత్ర నిలిచిపోయిందని, ప్రజలతో జగన్ మమేకమయ్యారని అన్నారు. తద్వారా తన గెలుపు ఖాయమన్న నమ్మకం జగన్ కు వచ్చిందని, ‘జనమే జగన్, జగనే జనం’ అన్నట్టుగా ఉందని, దాని ఫలితమే ఈ రోజున ఈ ఫలితాలు వచ్చాయని అన్నారు. ఎలాంటి నాయకుడు ఉండకూడదన్న విషయాన్ని చంద్రబాబును చూసి ప్రజలు తెలుసుకున్నారని, అందుకే, ఆయన్ని పక్కనపెట్టిన ఏపీ ప్రజలు, జగన్ కు పట్టం కట్టారని అన్నారు. 
YSRCP
jagan
sajjala
ramakrishna reddy

More Telugu News