kishan reddy: సికింద్రాబాద్ బీజేపీదే.. కిషన్ రెడ్డి ఘన విజయం

  • 3 లోక్ సభ స్థానాలను ఖాయం చేసుకున్న బీజేపీ 
  • సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డికి 51వేల 801 ఓట్ల మెజారిటీ
  •  తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడి ఓటమి
తెలంగాణలో ఎన్నికల ఫలితాలు చూస్తుంటే, ఇక్కడ బీజేపీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదయం నుంచి 4 స్థానాల్లో ముందంజలో వున్న బీజేపీ, ఇప్పటికే కరీంనగర్ .. ఆదిలాబాద్ లోక్ సభ స్థానాలను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ జాబితాలోకి సికింద్రాబాద్ లోక్ సభ స్థానం కూడా వచ్చి చేరింది.

సికింద్రాబాద్ లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి .. టీఆర్ఎస్ అభ్యర్థి సాయికిరణ్ యాదవ్ (తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు) పై విజయం సాధించారు. మొదటి నుంచీ కూడా బీజేపీ రథ సారథిగా కిషన్ రెడ్డికి మంచి గుర్తింపు వుంది. అందువలన ఆయన గెలుపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అనుకున్నట్టుగానే టీఆర్ఎస్ అభ్యర్థిపై కిషన్ రెడ్డి 51 వేల 801 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. పొతే, నిజామాబాద్ లో కూడా బీజేపీ ముందంజలో వుంది. 
kishan reddy

More Telugu News