Amit Shah: అద్వానీ రికార్డును బద్దలు కొడుతూ అమిత్ షా ఘనవిజయం

షార్ట్స్‌లో చూడండి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లోక్ సభ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించారు. గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి పోటీచేసిన ఆయన బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ పేరిట ఉన్న అత్యధిక మెజారిటీ రికార్డును తిరగరాస్తూ కాంగ్రెస్ అభ్యర్థి సీజే చావ్డాపై రికార్డు విక్టరీ నమోదు చేశారు. అద్వానీ గతంలో 4.83 లక్షల మార్జిన్ తో గెలుపొందగా, అమిత్ షా 5.11 లక్షల మార్జిన్ తో సరికొత్త రికార్డు సృష్టించారు. తాజా విజయంతో అమిత్ షా కూడా లోక్ సభలో అడుగుపెట్టనున్నారు. కాగా, జాతీయ స్థాయిలో ట్రెండ్స్ చూస్తే ఎన్డీయే 351 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, యూపీఏ 89 స్థానాల్లో ఎదురీదుతోంది. ఇతరులు 102 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
Go Back to Shorts
Amit Shah
BJP

More Telugu News