uttham kumar reddy: కాంగ్రెస్ ఖాతాలో నల్గొండ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి జయకేతనం

  • భువనగిరిలో కోమటిరెడ్డి విజయం 
  • ఉత్తమ్ కుమార్ రెడ్డికి 19,070 వేల ఓట్ల మెజారిటీ
  • ఓటమి పాలైన వేమిరెడ్డి నర్సింహా రెడ్డి
తెలంగాణాలో ఈ ఉదయం ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ వెలువడడం మొదలైన దగ్గర నుంచి కాంగ్రెస్ 3 ఎంపీ స్థానాల్లో ముందంజలో ఉంటూ వచ్చింది. కొంత సేపటి క్రితం భువనగిరి ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సొంతం చేసుకోగా, మరో ఎంపీ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తాజాగా నల్గొండ ఎంపీ స్థానాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి దక్కించుకున్నారు. 19,070 ఓట్ల మెజారిటీతో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహా రెడ్డిపై విజయాన్ని సాధించారు.
uttham kumar reddy

More Telugu News