YSRCP: నెల్లూరు జిల్లాలో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ... వైసీపీ క్లీన్ స్వీప్!

షార్ట్స్‌లో చూడండి
నెల్లూరు జిల్లాపై ఈసారైనా పట్టు సాధించాలని భావించిన టీడీపీకి తీవ్ర పరాభవం తప్పలేదు. మంత్రులు నారాయణ తదితర నేతలు సైతం ఓటమి బాటలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఒక్క స్థానంలోనూ ఆధిపత్యం చూపలేకపోయింది. నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఉదయం నుంచే ట్రెండ్స్ అన్నీ వైసీపీకి అనుకూలంగా కొనసాగాయి. ఏ రౌండ్ లోనూ టీడీపీ అభ్యర్థులు ఆశించిన స్థాయిలో ఓట్లు రాబట్టలేకపోయారు. మంత్రి నారాయణపై వైసీపీ యువనేత పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ భారీ ఆధిక్యం కొనసాగిస్తుండగా, ఇతర అభ్యర్థుల పరిస్థితి కూడా అలాగే ఉంది.
Go Back to Shorts
YSRCP
Telugudesam
Nellore District

More Telugu News