modi: కుటుంబ పార్టీలకు ప్రజలు గట్టి జవాబు చెప్పారు: బీజేపీ నేత లక్ష్మణ్

  • విభజన రాజకీయాలకు తావులేదు
  • మోదీ తీసుకొచ్చిన పథకాలే బీజేపీని గెలిపించాయి
  • నవభారత నిర్మాణానికి ఈ విజయం పునాది
కేంద్రంలో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతుండటంపై ఆ పార్టీ నేతలు
సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, కుటుంబ పార్టీలకు ప్రజలు గట్టి జవాబు చెప్పారంటూ కాంగ్రెస్ పార్టీపై పరోక్ష విమర్శలు చేశారు. విభజన రాజకీయాలకు తావులేదని ప్రజలు తమ ఓటు ద్వారా చెప్పారని, మోదీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే తమ పార్టీని గెలిపించాయని అన్నారు.

ప్రతిపక్షాలు మోదీని వ్యక్తిగతంగా విమర్శించాయని, నవభారత నిర్మాణానికి ఈ విజయం పునాది అని, ఈ విజయంతో కుల, మత రాజకీయాలకు తెర పడినట్టయిందని అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి పలికేదాకా తమ పోరాటం ఆగదని, సీఎం కూతురిని ఓడించే స్థాయికి బీజేపీ ఎదిగిందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
modi
pm
bjp
Telangana
lakshman

More Telugu News