komati reddy: టీఆర్ఎస్ చేజారిన భువనగిరి.. కాంగ్రెస్ అభ్యర్థి కోమటి రెడ్డి వెంకటరెడ్డి విజయం

  • తెలంగాణలో ఆసక్తికర ఫలితాలు 
  • నిన్నటి వరకు టీఆర్ఎస్ చేతిలో భువనగిరి  
  • ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కోమటిరెడ్డి
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా భువనగిరి ఎంపీ స్థానాన్ని కాంగ్రస్ అభ్యర్థి కోమటి రెడ్డి వెంకట రెడ్డి సొంతం చేసుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పై ఆయన విజయాన్ని సాధించారు. టీఆర్ఎస్ కి బలమైన స్థానంగా చెప్పుకునే భువనగిరి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోవడం గమనార్హం. తన గెలుపుకు కారణమైన ప్రజలకు కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
komati reddy

More Telugu News