Narendra Modi: మోదీ సొంత రాష్ట్రంలో ఎదురులేని బీజేపీ

షార్ట్స్‌లో చూడండి
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీకి అడ్డేలేకుండా పోయింది. గుజరాత్ లో 26 లోక్ సభ స్థానాలు ఉండగా, అన్నింట్లో బీజేపీ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. ఓట్ల శాతం కూడా కాషాయదళానికే అధికంగా నమోదైనట్టు ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటివరకు లెక్కించిన రౌండ్ల ఆధారంగా, బీజేపీకి 61.78 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 32.40 శాతం లభించినట్టు అర్థమవుతోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ లో బీజేపీకి తేలికపాటి ఎదురుదెబ్బ తగిలిందనే భావించాలి. మొత్తం 182 స్థానాలకు 99 సీట్లలో బీజేపీ గెలిచింది. ఆ ఫలితాలను దృష్టిలో పెట్టుకున్న మోదీ, అమిత్ షా ద్వయం గుజరాత్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అద్భుతమైన రీతిలో ఫలితాలు రాబడుతోంది. ఈ లోక్ సభ ఎన్నికల్లో గుజరాత్ లోని 26 స్థానాలను కైవసం చేసుకునే దిశగా కమలనాథులు దూసుకెళుతున్నారు.
Go Back to Shorts
Narendra Modi
BJP
Congress

More Telugu News