Andhra Pradesh: లోక్ సభ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ.. మొత్తం 25 ఎంపీ స్థానాల్లోనూ ఆధిక్యం!

  • నెల్లూరులో మంత్రి నారాయణకు చుక్కెదురు
  • పీలేరులో కిశోర్ కుమార్ రెడ్డికి షాక్
  • నంద్యాలలో వైసీపీ అభ్యర్థి రవిచంద్రారెడ్డి ముందంజ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 152 స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లోనూ ఫ్యాను జోరు కొనసాగుతోంది. ప్రస్తుతం ఏపీలోని 25 లోక్ సభ స్థానాలకు గానూ 25 స్థానాల్లోనూ లీడింగ్ లో కొనసాగుతోంది.

నెల్లూరు అర్బన్ లో వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ నేత, మంత్రి నారాయణపై 4,400 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. పీలేరులో వైసీపీ నేత చింతల రామచంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్థి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పై లీడ్ లో కొనసాగుతున్నారు. అలాగే నంద్యాలలో శిల్పా రవిచంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిపై ఆధిక్యంలో ఉన్నారు.
Andhra Pradesh
loksabha
25 seats
YSRCP
Telugudesam

More Telugu News