Rahul Gandhi: ఫలితం ఏదైనా అనునిత్యం నేను మీ వెంటే...ప్రియాంక, వాద్రా నుద్దేశించి రాహుల్‌పోస్టు

  • ఆల్‌ ద బెస్ట్‌...గుడ్‌ లక్‌ అంటూ వ్యాఖ్యానం
  • చెల్లి, బావతో ఉన్న ఫొటోలు కూడా పోస్టింగ్‌
  • కార్యకర్తలకు కూడా విషెస్‌ చెప్పిన రాహుల్‌
సార్వత్రిక ఎన్నికల ఫలితాల అంచనాలు తప్పిన కారణంగానో, సొంత నియోజకవర్గం అమేథిలో టఫ్‌ ఫైట్‌ ఎదుర్కొంటున్న కారణంగానో రాహుల్‌ ఈరోజు ట్విట్టర్‌లో ఆసక్తికర కామెంట్‌ పెట్టారు. ఎన్నికల్లో తన విజయం కోసం అవిశ్రాంతంగా ప్రచారం చేసిన సోదరి ప్రియాంకాగాంధీని, ఆమె భర్త వాద్రాను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ ’ఫలితం ఏదైనా నేను మీ వెంటనే ఉంటాను. ఆల్‌ ద బెస్ట్‌...గుడ్‌ లక్‌’ అంటూ వ్యాఖ్యానించారు. వారిరువురినీ ‘R’ (రాహుల్‌), ‘P’ (ప్రియాంక) అని సంబోధించారు. ఈ సందర్భంగా చెల్లి, బావతో కలిసి దిగిన ఫొటోలను కూడా పోస్టు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడైన రాహుల్‌ గాంధీ ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, కేరళలోని వాయినాడ్‌ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
Rahul Gandhi
Twitter
priyanka vadrt

More Telugu News