Andhra Pradesh: కోడెలపై అంబటి రాంబాబు పైచేయి.. గుంటూరులో క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ!

  • కోడెలపై 4,356 ఓట్ల లీడింగ్ లో అంబటి
  • గురజాలలో కాసు మహేశ్ రెడ్డి ముందంజ 
  • మాచర్లలో మూడోసారి మ్యాజిక్ చేయనున్న పిన్నెల్లి
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో అధికార టీడీపీకి ఎదురుగాలి వీస్తోంది. జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు టీడీపీ అభ్యర్థి, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై 4,356 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఇక వినుకొండలో వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులుపై 7,552 ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.

గురజాలలో వైసీపీ నేత కాసు మహేశ్ రెడ్డి టీడీపీ అభ్యర్థి యరపతినేనిపై 206 ఓట్ల లీడ్ తో కొనసాగుతున్నారు. అలాగే మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సమీప ప్రత్యర్థిపై 5,345  ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. మొత్తంగా జిల్లాలోని 17 స్థానాల్లో వైసీపీ 15 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతోంది. తాజా అప్ డేట్స్ ప్రకారం వైసీపీ 147, టీడీపీ 27, జనసేన గాజువాకలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
Andhra Pradesh
YSRCP
Telugudesam
Guntur District

More Telugu News