Andhra Pradesh: కల్వకుంట్ల కవితకు ‘పసుపు రైతుల’ దెబ్బ.. 18,000 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ!

  • దూసుకుపోతున్న బీజేపీ అభ్యర్థి అరవింద్
  • మల్కాజ్ గిరిలో వెనుకపడ్డ రేవంత్ రెడ్డి
  • సికింద్రాబాద్ లో సత్తా చాటుతున్న కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నిజామాబాద్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత వెనుకంజలో ఉన్నారు. నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అరవింద్ కవితపై 18,000 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. మరోవైపు మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖరరెడ్డి అక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సికింద్రాబాద్ లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి, తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని కిరణ్ కుమార్ యాదవ్ పై లీడింగ్ లో దూసుకుపోతున్నారు.

Andhra Pradesh
Telangana
loksabha
kavitha

More Telugu News