Telugudesam: అయ్యన్నపాత్రుడు, అమర్ నాథ్, సోమిరెడ్డి... టీడీపీ కీలక నేతలంతా వెనుకంజ!

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన పలువురు ప్రముఖులు మూడు నుంచి నాలుగు రౌండ్లు పూర్తయ్యే వరకు వెనుకంజలో ఉన్నారు. సీనియర్ మంత్రులు అయ్యన్నపాత్రుడితో పాటు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి తదితరులు వెనుకబడ్డారు. ఈ ఫలితాలతో నైరాశ్యంలో పడ్డ తెలుగుదేశం పార్టీ నేతలు, ఇప్పటివరకూ మీడియా ముందుకు వచ్చేందుకు సాహసించలేదు. ఫలితాలు తొలి దశలోనే ఉన్నాయని, ఇంకా ఎన్నో రౌండ్లు లెక్కించాల్సివున్నందున వేచి చూస్తున్నామని కొందరు అంటున్నా, ఫలితాలు టీడీపీకి వ్యతిరేకమేనన్న సంకేతాలు వెలువడుతున్న పరిస్థితి నెలకొంది.
Go Back to Shorts
Telugudesam
YSRCP
Elections

More Telugu News