Andhra Pradesh: మంగళగిరిలో లోకేశ్ వెనుకంజ.. దూసుకుపోతున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి!

  • 600 ఓట్ల ఆధిక్యంలో ఆర్కే
  • గుంటూరులో 9 చోట్ల వైసీపీ లీడింగ్
  • ఏపీలో 107 సీట్లలో వైసీపీ దూకుడు
ఆంధ్రప్రదేశ్ లోని కీలకమైన మంగళగిరిలో అనూహ్యమైన ఫలితాలు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి, ఏపీ మంత్రి నారా లోకేశ్ పై 600 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. మరోవైపు గుంటూరు జిల్లాలోని 17 స్థానాల్లో వైసీపీ 9 చోట్ల, టీడీపీ 2 చోట్ల లీడింగ్ లో ఉన్నాయి. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం వైసీపీ 107, టీడీపీ 26, జనసేన 2 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. అలాగే లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 25 స్థానాలకు గానూ వైసీపీ 14 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుండగా, టీడీపీ ఐదు స్థానాల్లో దూసుకుపోతోంది. జనసేన, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటివరకూ పోటీలో లేవు. 
Andhra Pradesh
mangalagiri
Guntur District
YSRCP
alla
rk

More Telugu News