YSRCP: తొలి రౌండ్... పోటీ చేసిన రెండు చోట్లా వెనుకబడ్డ పవన్ కల్యాణ్!

  • పోస్టల్ బ్యాలెట్లలో పవన్ ఆధిక్యం
  • ఆపై వెనుకంజలో జనసేనాని
  • దూసుకెళుతున్న వైసీపీ
పోస్టల్ బ్యాలెట్లలో ఆధిక్యం చూపించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, తొలి రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి వెనుకబడిపోయారు. ఆయన భీమవరం, గాజువాక నుంచి పోటీ చేయగా, రెండు చోట్లా ఆయన వెనుకంజలో ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి వైసీపీ తరఫున పోటీ పడిన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కాగా, ప్రస్తుతం అందుతున్న ఫలితాలను అనుసరించి ఏపీలోని 175 నియోజకవర్గాల్లో 69 స్థానాల ట్రెండ్స్ అందగా, 16 చోట్ల తెలుగుదేశం పార్టీ 53 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నాయి.
YSRCP
Telugudesam
Pawan Kalyan
Jana Sena

More Telugu News