Chandragiri: మొదలైన రగడ... చంద్రగిరిలో కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు!

  • తెరచుకున్న పోస్టల్ బ్యాలెట్లు
  • బాహాబాహీకి దిగిన ఏజంట్లు
  • సర్దిచెప్పేందుకు పోలీసుల యత్నం
ముందుగా ఊహించినట్టుగానే కౌంటింగ్ సందర్భంగా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య రగడ మొదలైంది. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ మొదలుకాగానే, ఇరు పార్టీల ఏజంట్లూ బాహాబాహీకి దిగారు. పోస్టల్ బ్యాలెట్లను అధికారులు తెరిచి, కౌంటింగ్ ను ప్రారంభించగానే, తెలుగుదేశం కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఓట్లను అధికారులు తప్పుగా లెక్కిస్తున్నారని వారు ఆరోపిస్తుండగా, వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో రభస మొదలైంది. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడగా, ఇరు వర్గాలనూ సముదాయించేందుకు పోలీసులు, అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Chandragiri
Telugudesam
YSRCP

More Telugu News