Elections: పొద్దుపొద్దున్నే దేవుళ్లను ఆశ్రయించి ప్రత్యేక పూజలు చేస్తున్న పలువురు అభ్యర్థులు!

  • మరికొన్ని గంటల్లో ఫలితాల వెల్లడి
  • దేవాలయాలకు వెళ్లిన నేతలు
  • ప్రత్యేక పూజలు చేస్తున్న అభ్యర్థులు
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడికానున్న వేళ, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఈ ఉదయం దేవాలయాలను ఆశ్రయించారు. ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. తిరువనంతపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కుమ్మనమ్‌ రాజశేఖరన్‌, థైకాడ్‌ లోని అయ్యగార్ ఆశ్రమానికి వెళ్లి పూజలు చేశారు. కర్ణాటకలో అత్యంత ఆసక్తిని కలిగించిన ఈ ఎన్నికల్లో జేడీఎస్‌ తరఫున పోటీ చేసిన నిఖిల్‌ కుమారస్వామి, మైసూరుకు వచ్చి, నగరంలోని చాముండేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కుమారస్వామి సైతం ఆలయానికి వెళ్లారు.  ఇక గోరఖ్‌ పూర్‌ నుంచి పోటీ చేసిన భోజపురి నటుడు రవికిషన్‌, తన ఇంట్లోనే దేవుడి పటాల ముందు మోకరిల్లి పూజలు చేశారు. ఇలా పలువురు అభ్యర్థులు తమ గెలుపును కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు.
Elections
Temple
Karnataka
Tamilnadu

More Telugu News