Telangana: క్లీన్ స్వీప్ చేస్తున్నాం.. సంబురాలకు రెడీ అవండి: పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపు

  • 16 స్థానాలూ మనవే
  • విపక్షాలు మరోమారు చిత్తుగా ఓడిపోతున్నాయి
  • పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండండి
రాష్ట్రంలోని మొత్తం లోక్‌సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేయబోతున్నామని, సంబురాలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. జిల్లాలోని మంత్రులు, పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బుధవారం తన నివాసంలో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫలితాలు ఏకపక్షంగా ఉండబోతున్నాయని, 16 లోక్‌సభ స్థానాలను టీఆర్ఎస్‌ గెలుచుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

విపక్షాలు మళ్లీ చిత్తుగా ఓడిపోబోతున్నాయన్నారు. లెక్కింపు సమయంలో ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల విధానానికి టీఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటించినట్టు కేసీఆర్ తెలిపారు. ఈ విషయంలో విపక్షాలది అనవసర రాద్ధాంతమని కొట్టిపారేశారు.
Telangana
Lok Sabha
Election result
KCR

More Telugu News