Sonam Kapoor: పచ్చల హారం ధరించి హొయలుపోయిన సోనమ్ కపూర్!

  • కేన్స్ లో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్
  • రెడ్ కార్పెట్ పై నడిచిన సోనమ్ కపూర్
  • తెలుపు దుస్తుల్లో అలరించిన బ్యూటీ
యూత్ ఫ్యాషన్‌ ఐకాన్‌ సోనమ్‌ కపూర్‌, కేన్స్ లో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిసిపోయింది. తళతళలాడుతున్న తెల్లటి టుక్సెడోను ధరించిన ఆమె, అదే రంగులో ఉన్న మ్యాచింగ్ హై హీల్స్‌ వేసుకుని, రెడ్ కార్పెట్ పై నడుస్తున్న వేళ, వందలాది కెమెరాలు క్లిక్ మన్నాయి. ఆమె తన మెడలో ధరించిన పచ్చల హారం మరింత ఆకర్షించింది. ఎర్ర తివాచీపై సోనమ్ కపూర్ వయ్యారంగా నడుస్తూ హొయలొలికించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫెస్టివల్ కోసం సోనమ్‌ ను సిద్ధం చేసే బాధ్యతలను ఆమె సోదరి రియా కపూర్‌ తీసుకుందట. రియా ప్రత్యేకంగా స్టైలింగ్‌ చేయగా, సోనమ్ ఈ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై నడిచి అందరినీ అలరించింది.
Sonam Kapoor
Cannes
Red Carpet

More Telugu News