Guntur District: తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్న వైఎస్ జగన్

  • గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లికి జగన్
  • ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
  • జగన్ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం
రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లికి వెళ్లారు. జగన్ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. జగన్ ‘జడ్’ కేటగిరి భద్రతలో ఉన్నందున ఆ మేరకు పోలీస్ సిబ్బందిని, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

అలాగే, ఏపీ పోలీస్ ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు, ఈ రోజు జగన్ హైదరాబాదులోని తన ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు శంషాబాద్ విమానాశ్రయం వరకు తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 
Guntur District
tadepally
YSRCP
jagan
election

More Telugu News