Anantapur District: రౌడీ షీటర్లకు కౌంటింగ్ ఏజెంట్లుగా అనుమతివ్వడం దారుణం: వైసీపీ నేత తోపుదుర్తి

  • రాప్తాడు కౌంటింగ్ కేంద్రంలో గొడవలు సృష్టించే యత్నం
  • టీడీపీ చీఫ్ ఏజెంట్ సహా 17 మందికి నేర చరిత్ర ఉంది
  • ఆర్వోపై ఉన్నతాధికారులకు తోపుదుర్తి ఫిర్యాదు
రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాప్తాడు కౌంటింగ్ కేంద్రంలో గొడవలు సృష్టించేందుకు టీడీపీ నేత పరిటాల సునీత కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రౌడీ షీటర్లకు కౌంటింగ్ ఏజెంట్లుగా అనుమతి ఇవ్వడం దుర్మార్గమని, టీడీపీ చీఫ్ ఏజెంట్ నారాయణ చౌదరి సహా 17 మంది నేర చరిత్ర ఉన్న వారికి కౌంటింగ్ ఏజెంట్లుగా ఆర్వో అనుమతి ఇచ్చారని ఆరోపించారు. ఈ మేరకు ఆర్వో జయ నాగేశ్వరరావుపై అనంతపురం జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీజీపీలకు ఆయన ఫిర్యాదు చేశారు.
Anantapur District
raptadu
Telugudesam
YSRCP
topu

More Telugu News