Andhra Pradesh: వైసీపీ110 నుంచి 140 స్థానాలు గెలవబోతోంది: అంబటి రాంబాబు

  • మా గెలుపుపై ఎంతో నమ్మకంగా ఉన్నాం
  • వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం
  • ప్రతిపక్షనాయకుడిగా జగన్ పదేళ్లు కష్టపడ్డారు
ఏపీలో వైసీపీ గెలుపుపై ఆ పార్టీ నేతలు మరోసారి ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, తమ గెలుపుపై ఎంతో నమ్మకంగా ఉన్నామని, 110 నుంచి 140 స్థానాలను వైసీపీ కైవసం చేసుకోబోతోందని, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడబోతోందనడంలో ఎటువంటి సందేహామూ లేదని చెప్పారు. వైసీపీ గెలుపు ఖాయమని ఏ విధంగా చెప్పగలుగుతున్నారన్న ప్రశ్నకు అంబటి స్పందిస్తూ, ఎన్నికలు జరిగిన తీరు, ప్రభుత్వ వ్యతిరేకత అని చెప్పారు. ముఖ్యంగా, ప్రతిపక్షనాయకుడిగా జగన్ పదేళ్ల పాటు కష్టపడ్డారని, తన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాల్లో భాగస్వాములయ్యారని అన్నారు.
Andhra Pradesh
YSRCP
ambati
Telugudesam

More Telugu News