Andhra Pradesh: టీడీపీ విజయం సాధించాలంటూ రాజమండ్రిలో సుదర్శన హోమం

  • రాజ్యం సుభిక్షంగా ఉండాలి
  • చంద్రబాబుకు రాజ్యాధికారం మళ్లీ రావాలి
  • అందుకే, లక్ష్మీ గణపతి సుదర్శన హోమం  
ఏపీలో టీడీపీ మరోమారు విజయ కేతనం ఎగురవేయాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ నేతలు ఇప్పటికే దైవపూజలు నిర్వహించారు. తాజాగా, రాజమండ్రిలో సుదర్శన హోమం నిర్వహించారు. గుడా చైర్మన్ గన్ని కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక విఘ్నేశ్వర ఆలయంలో లక్ష్మీ గణపతి సుదర్శన హోమం ఈరోజు నిర్వహించారు. ఈ హోమానికి టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, ఎమ్మెల్యే అభ్యర్థులు పెందుర్తి వెంకటేశ్, ఆదిరెడ్డి భవాని, రాజమండ్రి లోక్ సభ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప తదితరులు హాజరయ్యారు. రాజ్యం సుభిక్షంగా ఉండటం కోసం, చంద్రబాబుకు రాజ్యాధికారం మళ్లీ రావడం కోసం ఈ యాగం నిర్వహిస్తున్నట్టు టీడీపీ నేతలు చెప్పారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడం ఖాయమని, 115 సీట్లకు పైగా ఆయన గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
Andhra Pradesh
rajahmundry
sudarshan homam

More Telugu News