Telangana: అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం.. రేపు ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభిస్తాం!: తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్

  • ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తాం
  • ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 36 టేబుల్స్ ఏర్పాటు
  • హైదరాబాద్ లో మీడియాతో రజత్ కుమార్
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) రజత్ కుమార్ ఈరోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ప్రతీ నియోజకవర్గానికి రెండు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 36 టేబుల్స్ ను ఏర్పాటు చేశామని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు.

‘ఐదు వీవీప్యాట్‌లు సెలెక్ట్‌ చేసి వాటిని ఈవీఎం లెక్కలతో సరిచూస్తాం. కౌంటింగ్‌కు భారీ భద్రత ఏర్పాటు చేశాం. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభిస్తాం. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ జరుగుతుంది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. కౌంటింగ్‌ సందర్భంగా 6,745 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారు’ అని రజత్ కుమార్ తెలిపారు. ఈవీఎంల్లో పడ్డ ఓట్లు, వీవీప్యాట్ స్లిప్పుల మధ్య తేడా రాదని స్పష్టం చేశారు.
Telangana
EC
ceo
rajat kumar
Hyderabad
loksabha election2019

More Telugu News