Andhra Pradesh: కుప్పంలో గంగమ్మతల్లికి సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు!

  • గంగమ్మతల్లి జాతరకు హాజరైన సీఎం
  • చంద్రబాబు దంపతుల్ని శాలువాతో సన్మానించిన పాలకమండలి
  • మొక్కులు చెల్లించుకున్న టీడీపీ అధినేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు సొంత నియోజకవర్గం కుప్పంకు చేరుకున్నారు. అక్కడ వెలసిన గంగమ్మ అమ్మవారి జాతరలో పాల్గొన్నారు. భార్య భువనేశ్వరితో కలిసి ఆలయానికి వచ్చిన ఏపీ సీఎం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పాలకమండలి సభ్యులు చంద్రబాబు దంపతులను శాలువాతో సన్మానించారు. ముఖ్యమంత్రి వెంట జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి తదితరులు ఉన్నారు.
Andhra Pradesh
kuppam
Chandrababu
Telugudesam
gangamma talli

More Telugu News