samanta: సమంత తాజా చిత్రం నుంచి ఫస్టులుక్

షార్ట్స్‌లో చూడండి
ఇటీవల కాలంలో సమంత విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ వెళుతోంది. అందులో భాగంగానే ఆమె నందినీ రెడ్డి దర్శకత్వంలో 'ఓ బేబీ' సినిమా చేస్తోంది. 'మిస్ గ్రానీ' అనే కొరియన్ సినిమాకి ఇది రీమేక్. కొత్తదనంతో కూడిన కథాకథనాలతో ఈ సినిమా సాగుతుంది.

ఇంతవరకూ చేయని పాత్రలో ఈ సినిమాలో సమంత కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. సమంత లుక్ ఆకట్టుకునేలా వుంది. ఆమె పాత్ర చుట్టూనే కథ అంతా తిరుగుతుందనే విషయం టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది. సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యమైన పాత్రల్లో ఊర్వశి .. రాజేంద్రప్రసాద్ .. రావు రమేశ్ .. నాగశౌర్య నటిస్తున్నారు. టైటిల్ రోల్ చేస్తోన్న సమంత ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.
Go Back to Shorts
samanta
lakshmi

More Telugu News