Andhra Pradesh: మరోసారి హైకోర్టును ఆశ్రయించిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్!

  • ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్
  • విచారణకు స్వీకరించిన ధర్మాసనం
  • సైబర్ క్రైమ్ పోలీసులకు టీవీ9 యాజమాన్యం ఫిర్యాదు
పరారీలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. టీవీ9లో ఫోర్జరీ, మోసానికి పాల్పడ్డ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. రవిప్రకాశ్ పై టీవీ9 యాజమాన్యం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

దీంతో ఐపీసీ, సీఆర్పీసీ, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు, రవిప్రకాశ్, నటుడు శొంఠినేని శివాజీలకు నోటీసులు జారీచేశారు. అయితే మూడుసార్లు నోటీసులు అందుకున్నప్పటికీ వీరిద్దరూ విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ దేశం విడిచిపెట్టి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీచేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు నేడు విచారించనుంది.
Andhra Pradesh
Telangana
tv9
ravi prakash
bail petition

More Telugu News