Andhra Pradesh: అమెరికా, ఇంగ్లండ్ పత్రికలు మోదీపై విషం కక్కుతున్నాయి!: ఐవైఆర్ కృష్ణారావు ఫైర్

  • ప్రధానిని ఇవి లక్ష్యంగా చేసుకుంటున్నాయి
  • బలమైన భారత్ విదేశాలకు కంటగింపు 
  • ట్విట్టర్ లో స్పందించిన ఏపీ మాజీ సీఎస్
అమెరికా, ఇంగ్లండ్ లకు చెందిన పత్రికలు ప్రధాని నరేంద్ర మోదీపై విషం కక్కుతున్నాయని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. టైమ్స్ పత్రిక, ఎకనమిస్ట్, తాజాగా గార్డియన్ లు మోదీని లక్ష్యంగా చేసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ కు మోదీగారే సరైన వ్యక్తి అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏదీ ఉండదని వ్యాఖ్యానించారు. పాశ్చాత్య దేశాలకు బలమైన భారత్ ఉండటం ఏనాడూ ఇష్టం లేదని చెప్పారు.

ఈరోజు ట్విట్టర్ లో ఐవైఆర్ స్పందిస్తూ..‘అమెరికా, ఇంగ్లండ్ పత్రికలు  మోదీ గారి మీద విషం కక్కుతున్నాయి. టైమ్స్, ఎకానమిస్ట్, తాజాగా గార్డియన్. మోదీగారే దేశానికి సరైన వ్యక్తి అని ఇంతకన్నా పెద్ద సాక్ష్యం మనకు అవసరం లేదు. పాశ్చాత్య పత్రికలకు బలమైన భారతదేశం ఏనాడు ఒక ఎజెండా కాదు. ఇంత కన్నా భిన్నంగా వాళ్లు రాస్తారని అనుకోలేదు’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
BJP
Narendra Modi
iyr
Twitter
western media
angry

More Telugu News