Vivek Oberoi: చిక్కుల్లో నటుడు వివేక్ ఒబెరాయ్.. ఐశ్వర్య రాయ్ మీమ్‌పై ముంబై పోలీసులకు మహిళా కాంగ్రెస్ ఫిర్యాదు

  • ఎగ్జిట్ పోల్స్‌పై ఐశ్వర్య మీమ్‌ను పోస్టు చేసిన వివేక్
  • దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు
  • ట్వీట్ డిలీట్ చేసి క్షమాపణలు చెప్పిన నటుడు
ఎగ్జిట్ పోల్స్ తర్వాత నటి ఐశ్వర్యరాయ్ మీమ్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నటుడు వివేక్ ఒబెరాయ్‌ మరిన్ని చిక్కుల్లో పడ్డాడు. దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ, క్రీడా, సినీ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న వివేక్ ఒబెరాయ్ చివరికి దిగొచ్చాడు.

తన ట్వీట్‌ను డిలీట్ చేసి క్షమాపణలు వేడుకున్నాడు. తానెప్పుడూ మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించలేదని, గత పదేళ్లలో 2వేల మందికిపైగా నిరుపేద ఆడ పిల్లలకు సాయం చేస్తూ వచ్చానని ట్వీట్ చేశాడు. కొన్నిసార్లు మనకు సరదాగా కనిపించినవి మిగతా వారికి అలా కనిపించవని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ట్వీట్ చేసిన మీమ్ వల్ల ఏ ఒక్క మహిళ బాధపడినా తనను క్షమించాలని, ఆ ట్వీట్‌ను డిలీట్ చేస్తున్నానని పేర్కొన్నాడు.  

వివేక్ క్షమాపణలు చెప్పినప్పటికీ ముంబై మహిళా కాంగ్రెస్ మాత్రం ఊరుకునేట్టు కనిపించడం లేదు. మహిళలను కించపరిచేలా పోస్టు చేసిన వివేక్ ఒబెరాయ్‌పై సెక్షన్ 509 ప్రకారం కేసు నమోదు చేయాలని ముంబై పోలీసులకు లేఖ రాసింది.
Vivek Oberoi
Bollywood
Aishwarya Rai
mahila congress

More Telugu News