Street light: నీడ కోసం స్ట్రీట్ లైట్ కింద నిల్చుంటే.. జారిపడి ప్రాణం తీసింది!

  • హైదరాబాద్‌ శివారులోని దమ్మాయిగూడలో ఘటన
  • స్ట్రీట్‌లైట్ తలమీద పడడంతో తీవ్ర గాయాలు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
స్నేహితుడితో మాట్లాడుతున్న ఓ వ్యక్తి ఎండకు తట్టుకోలేక స్ట్రీట్ లైట్ కిందికి వెళ్తే అది అతడి తలపై పడి మరణించిన ఘటన హైదరాబాద్ శివారులోని దమ్మాయిగూడ సాయిబాబానగర్‌లో జరిగింది. స్థానికంగా నివసించే కాముని కిష్టయ్య(50) ఈ నెల 12న మధ్యాహ్నం అంబేద్కర్ నగర్‌లోని జగదాంబ జువెల్లర్స్ సమీపంలో తన స్నేహితుడిని కలిసి మాట్లాడుతున్నాడు. ఎండ తీవ్రంగా ఉండడంతో పక్కనే ఉన్న స్ట్రీట్ లైట్ నీడలోకి వెళ్లారు.

ఇద్దరూ మాట్లాడుకుంటుండగా స్ట్రీట్ లైట్ అకస్మాత్తుగా ఊడిపడి కిష్టయ్య తలపై పడింది. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కిష్టయ్య కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Street light
Hyderabad
dead
Police
Telangana

More Telugu News